బాక్సింగ్ దిగ్గజం మహ్మద్‌అలీ కన్నుమూత.. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల నివాళులు
posted on Jun 4, 2016 12:15PM

బాక్సింగ్ దిగ్గజం మహ్మద్‌అలీ (74) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన అమెరికాలోని ఫీనిక్స్ లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందారు. మహ్మద్‌అలీ 1942 జనవరి 17న జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టిన అలీ.. 22 ఏళ్లకే వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ గా అవతరించాడు. ఆయన మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా గెలిచారు.
మరోవైపు మహ్మద్‌అలీ మృతికి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. బాలీవుడ్ చోటా బచ్చన్ అభిషేక్ బచ్చన్... అలీ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు. బాక్సింగ్ లెజెండ్ ఆత్మకు శాంతి చేకూరాలని అతడు కోరాడు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా అలీ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఓ గొప్ప క్రీడాకారుడిని కోల్పోయామని అతడు ఆ సందేశంలో పేర్కొన్నాడు.