మథురలో కొనసాగుతున్న ఉద్రిక్తత... హేమమాలినిని అడ్డుకున్న పోలీసులు..

 

మథురలో ఇంకా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమణలను తొలగించేందుకు వచ్చిన పోలీసులపై అక్రమణదారులు తుపాకులు, గ్రానైడ్లతో దాడి చేయగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఎస్పీ సహా 24 మంది మృతి చెందారు. మరోవైపు ఈ కేసులో భాగంగా ఇప్పటికే 400 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఇంకా సీఎం అఖిలేష్ యాదవ్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

 

ఇదిలా ఉండగా ఎంపీ హేమమాలిని మథుర ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. కాగా బీజేపీ మథురలో బంద్ కు పిలుపునిచ్చింది.