పాదయాత్ర కాదు.. పాదం కూడా బయటపెట్టనివ్వట్లేదుగా..

 

కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అడుగడుగా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ మధ్యనే చలో అమరావతి పాదయాత్ర చేపట్టిన ముద్రగడకు చేదు అనుభవమే ఎదురైంది. కనీసం గేటు కూడా దాటకుండా ముద్రగడను పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి ముద్రగడ పాదయాత్రకు భంగం కలిగింది. ఈ ఉదయం పాదయాత్రను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. పాదయాత్ర కోసం తన ఇంటి నుంచి బయల్దేరిన ఆయనను ఇంటి గేటు వద్దే పోలీసులు ఆపేశారు. కాసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగిన ముద్రగడ... చివరకు తిరిగి తన ఇంట్లోకి వెళ్లి పోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి రోజు పాదయాత్రకు ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu