పిట్టకథ కూడా కాపీ కొట్టుడేనా జగనా...!

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి..తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న జరిగిన నంద్యాల బహిరంగ సభలో కేటీఆర్ చెప్పిన పిట్టకథనే జగన్ చెప్పి అందరిని నవ్వించాడు. నంద్యాలో జరిగిన బహిరంగ సభకు జగన్ హాజరైన సంగతి తెలిసిందే. ఇక ఈ సభకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ఈ సభలో ప్రసంగించిన జగన్ టీడీపీ పార్టీని ఉద్దేశించి ఓ పిట్ట కథ చెప్పారు. అందేంటంటే.. ఒక ఊరిలో పలు రకాల వ్యవసానాలకు బానిసైన 17 ఏళ్ల కుర్రాడు, తాగిన మత్తులో ఇంట్లో దొంగతనం చేస్తుండగా తల్లి చూసింది. ఇది తప్పని చెప్పబోయిన ఆమెను, రోకలి బండతో కొట్టి చంపాడు. దాన్ని చూసిన తండ్రి ప్రశ్నించగా, ఆయనను కూడా కొట్టి చంపాడు. పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి అతను చేసిన నేరాలు విని ఆశ్చర్యపోతూ సొంత తల్లిదండ్రులనే చంపిన నీకు ఏ శిక్ష విధించాలో చెప్పమని అడిగారు. అప్పుడు విలపిస్తూ, తల్లిదండ్రులు లేని పిల్లవాడినని, తనను విడిచిపెట్టాలని అడిగాడట. ఇప్పుడు తెలుగుదేశం వైఖరి కూడా అలాగే ఉందని జగన్ అన్నారు. ఇక ఈ కథ విన్నవారు... ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. అని ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లగా... అప్పుడు గుర్తొచ్చింది అందరికీ. ఈ స్టోరీ గతంలో కేటీఆర్ గారు చెప్పిన పిట్టకథ అని. మొత్తానికి జగన్ కథలు చెప్పడంలో కూడా కాపీ కొడుతున్నారన్నమాట...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu