ఆయనకూ కొన్ని బలహీనతలు ఆజాద్ పై పాల్వాయి

హైదరాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయనకూ అందరిలాగే కొన్ని బలహీనతలు ఉండచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. కాగా వీటన్నింటినీ అధికమించి ఆజాద్ పార్టీని ముందుకు నడింపించాలని పాల్వాయి పేర్కొన్నారు. ఇంకా పాల్వాయి మాట్లాడుతూ... జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోవడంలేదని అన్నారు. కాగా తెలంగాణలోని సామాజిక వర్గాలకు సమన్వయ కమిటిలో ప్రాతినిధ్యంలేదన్నారు. ఇంకా జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారం తిప్పి కొట్టడంలో కాంగ్రెస్ విఫలమైందని పాల్వాయి వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu