అనారోగ్యంతో టీడీపీ కార్యకర్త..ఆదుకోవాలని లోకేష్‌కి వినతి

 

నెల్లూరుకు చెందిన  తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జులై 6 న మంత్రి లోకేశ్ నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో ఆదుకోవాలని కార్యకర్త లోకేష్‌కి  విజ్ఞప్తి చేశారు. ప్రియమైన కార్యకర్తలారా!.. నేను చేసిన తప్పేమిటి, నన్ను ఎందుకు పార్టీ ఆదుకోవడం లేదు.

నేను ఉన్న బాధల్లో ఎంతో కొంత కార్యకర్తకు ఆర్థిక సహాయం చేస్తారని తెలుగుదేశం పార్టీ  కోసం ఎదురు చూస్తూ ఉన్నా !...దానికోసం మన కార్యకర్తలందరూ సహాయం చేయొచ్చు కదా!... ఆర్థికంగా కాదు, పార్టీ దృష్టికి తీసుకుపోయే దానికి లోకేష్ బాబు ఆరో తేదీ నెల్లూరు వస్తున్నారు. ఆయన దృష్టి తీసుకొని పోతారని కార్యకర్తలందరినీ వేడుకుంటున్నాను. ఇదే లాస్ట్ పిలుపు, తర్వాత చావటమా బతకటమా ఆలోచించుకుంటాను… నవంబర్ నుంచి మంచం మీదే ఉన్నాను మీరే ఆలోచించండని కార్యకర్త ఆవేవదన వ్యక్తం చేశారు.