తల్లి కూతురు పెళ్లి ప్లాన్.. పది లక్షలతో జంపు..  

వాళ్ళు ఇద్దరు తల్లీకూతుర్లు. కూతురు పెళ్లి కుదిరిందని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లి పేరంటానికి పిలుద్దామని వెళ్లారు. అనుకున్నట్లుగానే పెళ్లి కార్డు చేతిలో పెట్టారు. ఆ రోజు రాత్రి అయిందని అక్కడే పడుకుని పొద్దునే వెళ్లిపోతామని చెప్పారు. ఆడవాళ్లు , అందులో పరిచయం ఉన్నవాళ్లు అని ఓ మహిళా ఉందని అని చెప్పింది. ఆ ఇద్దరు ఆడవాళ్లు పడుకున్నారు. పొద్దునే వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ ఇంటి మహిళ షాక్ తిన్నది. ఏం జరిగిందో మీరే చూడండి.. 

అది ప్రకాశం జిల్లా. ఒంగోలు. ఆమె పేరు మనీషా. అనీషాకు గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన రాధాదేవి కుటుంబ సభ్యులతో పరిచయం ఉంది. దీంతో పలుసార్లు గుంటూరు వచ్చి వాళ్ల ఇంట్లో ఉండి వెళ్లేవాళ్లు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 29న మనీషా తన తల్లి ఝాన్సీతో కలిసి గుంటూరు వికాస్‌నగర్‌లోని రాధాదేవి ఇంటికి వచ్చారు. మనీషాకు వివాహం నిశ్చయమైందని పెళ్లికి పిలవడానికి వచ్చినట్లు తెలిపారు. రాత్రి పొద్దుపోవడంతో ఆరోజు ఆ ఇంట్లో ఉండి మరుసటిరోజు ఒంగోలు వెళ్లిపోయారు. 

కట్ చేస్తే.. రాధాదేవి ఇంట్లోని బీరువాలో చూస్తే బంగారపు వడ్డాణం, నక్లెస్‌, చెవిదిద్దులు, పట్టుచీర మొత్తం రూ.10 లక్షలు విలువచేసే వస్తువులు కనిపించడం లేదు. ఆ వస్తువులు చోరీకి గురైనట్లు రాధాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ డీఎస్పీ సుప్రజ, పట్టాభిపురం సీఐ శివప్రసాద్‌లు కేసు నమోదు చేసి విచారించగా మనీషా, ఆమె తల్లి ఝాన్సీలు ఆ నగలు చోరీ చేసినట్లు తేలడంతో వారిని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సోమవారం అరెస్టు చేసి రూ.10 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులు జప్తు చేసినట్లు తెలిపారు. కేసును ఛేదించిన సీఐ శివప్రసాద్‌, ఎస్‌ఐ సత్యన్నారాయణ, సిబ్బంది జానీ, సరస్వతీ, రమేష్‌బాబు, ఉమామహేష్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.    
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu