తెలంగాణాను న‌యా నిజాం దోచేస్తున్నారు.. జేపీ న‌డ్డా

తెలంగాణాను న‌యా నిజాం దోచేస్తున్నార‌ని, మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాట‌లోనే కేసీఆర్ న‌డుస్తున్నాడ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అన్నారు. వ‌రంగ‌ల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో న‌డ్డా ప్ర‌సంగించారు.

త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు కేసీఆర్‌ను ఇంటికి పంపు తార‌ని, రాష్ట్రంలోప్ర‌జాస్వామ్యాన్ని కేసీఆర్ సాగ‌నీయ‌డం లేద‌ని న‌డ్డా అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటిఎంలా మారింద‌ని ఎద్దేవా చేశారు. మల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చ జైలును కూల్చ‌డం త‌ప్ప మ‌రే  నిర్మాణం చేప‌ట్ట‌లేద‌ న్నారు. 
 
టీఆర్ ఎస్ పాల‌న‌లో తెలంగాణా అంధ‌కారంలోకి వెళ్లింద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బండి సంజ య్ చేప‌ట్టిన మూడు విడ‌త‌ల పాద‌యాత్ర విజ‌య‌వంత‌మైంద‌ని న‌డ్డా ఆనందం వ్య‌క్తం చేశా రు. కేసీఆర్ పాల‌న‌కు ముగింపు ప‌ల‌కాల‌నే సంజ‌య్ పాద‌యాత్ర చేప‌ట్టార‌ని న‌డ్డా అన్నారు. బీజేపీ స‌భ ఏర్పాటుకు ఇక్క‌డి ప్రభుత్వం అడుగ‌డుగునా ఆంక్ష‌లు పెట్ట‌డంప‌ట్ల బీజేపీ నేత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 144 సెక్షన్ బూచి చూపి జనం రాకుండా అడ్డుకున్నారని.. హైకోర్టు అనుమతితో సభ నిర్వహించు కుంటున్నామని జేపీ నడ్డా తెలిపారు. 

 కేంద్ర ప్రభుత్వ నిధులను కేసీఆర్ సర్కార్ దుర్వినియోగం చేస్తోంది.  జల్‌ జీవన్‌ మిషన్  కింద తెలంగా ణకు కేంద్రం 3,500 కోట్లు కేటాయింపు.  తెలంగాణ ప్రభుత్వం రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు.  అవినీతికి పాల్పడ్డ కేసీ ఆర్‌లో భయం మొదలైంద‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu