ఈడీకి లేఖ రాసిన మహేష్ బాబు ఎందుకంటే?

 

మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులకు బదులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాశారు.  రేపు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల.. విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు సూపర్ స్టార్ బదులిచ్చారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇందులో కొంత మొత్తం చెక్కుల రూపంలో, మరికొంత నగదు రూపంలో అందుకున్నారు. ఈ తీసుకున్న డబ్బులకు సంబంధించిన లెక్కలు వివరించాల్సిందిగా ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్ శివారులో ‘సాయి సూర్య డెవలపర్స్’ పేరుతో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.సంస్థ యాజమాన్యంలో ఉన్న సతీష్ గుప్త ప్రజలను మోసం చేసినట్టు నిర్ధారణ కావడంతో సైబరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.అనంతరం ఈ కేసును ఈడీకి బదిలీ చేశారు. సాయి సూర్య డెవలపర్స్‌తో పాటు సూరానా ఇండస్ట్రీస్ సంస్థ కూడా మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.