హైదరాబాద్‌ ఓఆర్ఆర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్..కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

 

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ టోల్ ప్లాజా వద్ద  భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  సభకు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో ఓఆర్ఆర్‌పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని.. క్రియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన వెహికల్స్ భారీగా వచ్చాయి. ఓఆర్‌ఆర్ మీదగా వరంగల్ వెళ్లుండటంతో ట్రాఫిమ్ భారీగా ఏర్పడింది. 500 మంది వేదిక పై కూర్చునేలా బాహుబలీ స్టేజీ సిద్ధం చేశారు.

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. 1213 ఎకరాల్లో సభ కోసం భారీ ఏర్పాట్లు చేసారు. 1100 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు ఈ సభను బీఆర్‌ఎస్ పార్టీ అధినాయ‌క‌త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ప‌క్కా రాజ‌కీయ వ్యూహం, ప్రణాళిక‌తో గులాబీబాస్  ఈ సభకు హాజరవుతున్నట్టు నేతలు చెబుతున్నారు. అయితే ఈ సభలో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండ‌బోతోంది..? ఆయన ఏం మాట్లాడబోతున్నారు? పార్టీ నాయ‌కుల‌కు, శ్రేణుల‌కు ఎలాంటి సందేశం, దిశానిర్దేశం చేయనున్నారు? కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎలా ఉంటాయి అనే దానిపై స‌ర్వత్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News