హర్యానా ముఖ్యమంత్రిగా ఖత్తార్
posted on Oct 21, 2014 3:24PM

హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ నాయకుడు మనోహర్‌లాల్ ఖత్తార్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఖత్తార్‌ను తమ నాయకుడిగా హర్యానా బీజేపీ శాసనసభ్యులు ఎన్నుకున్నారు. ఇక ఖత్తార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం లాంఛనమే. ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు పుష్కలంగా వున్న ఖత్తార్ ప్రధాని నరేంద్ర మోడీకి స్నేహితుడు. ఈ రెండు అంశాలతోపాటు నిజాయితీపరుడుగా, పార్టీలో సీనియర్‌గా, సమర్థుడిగా మనోహర్ లాల్ ఖత్తార్‌కి గుర్తింపు వుంది. 1980 నుంచి 1994 వరకు ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయిలో పనిచేసిన ఖత్తార్, ఆ తర్వాత బీజేపీలో చేరారు. 60 ఏళ్ల వయసున్న ఖత్తార్.. ఇప్పటికీ బ్రహ్మచారే. ఖత్తార్ బుధవారం హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం వుందని తెలుస్తోంది.