సాగు చట్టాలు రద్దు బిల్లుకు లోక్ సభ ఆమోదం..

అనుకున్నట్లుగానే, పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రగడ మొదలైంది. ఉభయసభల్లో రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్సభలో సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది.

ఇక్కడితో ఒక పనైపోయింది. సంవత్సర కాలానికి పైగా, రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్నఆందోళనకు ప్రభుత్వం తెరదించింది. సాగు చట్టాల రద్దు బిల్లు- 2021కి లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లును స్పీకర్ ఆమోదించారు. అనంతరం సభ మధ్యాహ్నం 2గంటలకు మరోసారి వాయిదాపడింది.అంతకు ముందు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ నిరసనలు చేపట్టారు. దీంతో తొలిరోజే ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మొదట సభలు ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన సభ్యులకు నివాళి అర్పించారు. లోక్సభలో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్ ఓం బిర్లా. దానిని విపక్షాలు అడ్డుకున్నాయి. రైతు సమస్యలు సహా ఇతర ప్రజాసంక్షేమ అంశాలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. సహకరించాలని విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గకపోవటం వల్ల సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్.

ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్షాలు ఆందోళనలు కొనసాగించారు. ఈ క్రమంలో కొత్త సాగు చట్టాల రద్దు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. బిల్లుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్ను తిరస్కరించిన స్పీకర్ ఓం బిర్లా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు. విపక్షాల ఆందోళనలు కొనసాగటం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా పడింది

రాజ్యసభలోనూ తొలుత గంట సేపు వాయిదా పండింది. విపక్షాల ఆందోళనలు సహా ఇటీవల మృతి చెందిన ప్రస్తుత సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్పై గౌరవ సూచకంగా ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం 12.20 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. దీంతో సభను మరోసారి మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.కాంగ్రెస్ ఆందోళన..పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళనకు దిగింది కాంగ్రెస్. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాసేపు నిరసన తెలిపారు ఆ పార్టీ ఎంపీలు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా కీలక నేతలు పాల్గొన్నారు.

పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. స్వాతంత్ర్యం, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తికి అనుగుణంగా పార్లమెంట్లో చర్చలు జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే గొంతు బలంగా ఉన్నా.. అది పార్లమెంట్, సభాపతుల గౌరవాన్ని కాపాడేలా ఉండాలని సూచించారు.సమావేశాల ప్రారంభానికి కొద్ద సమయం ముందు సీనియర్ కేబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు మోదీ. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పాల్గొన్నారు.మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు మోదీ. గరీబ్ కల్యాణ్ యోజనను 2022, మార్చి వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందించిన్నట్లు చెప్పారు. 2.6 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu