మోడల్ హత్య
posted on Apr 17, 2015 12:17PM

ఆస్ట్రేలియాకి చెందిన ఓ మోడల్ హత్యకు గురయ్యాడు. ఇరాక్‌కి వెళ్ళిన ఆయన అక్కడ హత్యకు గురయ్యాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కి చెందిన ఒక మోడల్ తీవ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇరాక్‌లో మోడలింగ్ కోసం వెళ్తున్నానని చెప్పి 2014 సంవత్సరంలో వెళ్ళాడు. అయితే అక్కడ అతను తీవ్రవాద క్యాంపుల్లో శిక్షణ తీసుకుటున్నట్టు తమ దగ్గర సమాచారం వుందని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. ప్రస్తుతం దేశాన్ని గడగడలాడిస్తూ, యువతను తీవ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో కలసి అతను పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను హత్యకు గురై కనిపించాడు. అతని మృతదేహం దగ్గర ఒక మిషన్ గన్ కూడా వుంది. అతన్ని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులే చంపేశారా, మరెవరైనా చంపారా అనేది ఇంకా తెలియరాలేదు.