వెంకయ్య మాటల వెనుక అంతరార్దం అదేనా..?

 

ఐక్యరాజ్యసమితి ఆవాస అధ్యక్షుడిగా వెంకయ్య ఎపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలో నేడు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రధాని మోడీ, జగన్ భేటీల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు కొత్త అర్ధాలకు తావిచ్చేవిలా ఉన్నాయి. ఇటీవల ప్రధానితో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కలవడంలో తప్పులేదని ప్రతిపక్ష నేత వచ్చి ప్రధానిని కలిస్తే తర్జన భర్జనలు ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ పరిపక్వత లేనివారే మోదీతో వైఎస్‌ జగన్‌ భేటీని విమర్శిస్తున్నారన్నారు. కొందరు ఈ విషయంలో ఎందుకు అతిగా స్పందిస్తున్నారో తెలియదని అన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో పెట్టుకోవాలి అనే విషయంపై ఆలోచిస్తామని అన్నారు.

 

అంతే వెంకయ్యనాయుడు వ్యాఖ్యలపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. వెంకయ్య చేసిన వ్యాఖ్యలను బట్టి తదుపరి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల మైత్రి కొనసాగుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతం ప్రస్తుతానికైతే ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..?మోదీతో జగన్ భేటీ ఈ రెండు పార్టీల మధ్యకు దారి తీస్తుందా? అనే కోణంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  మొత్తానికి అసలే ఎండ తీవ్రతకు మాడి మసైపోతున్న ఏపీలో వెంకయ్య వ్యాఖ్యలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. మరి బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu