జగన్ దూతగా షర్మిలను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
posted on Feb 11, 2021 4:09PM
తెలంగాణాలో రాజన్న రాజ్యం కోసం కొత్తగా పార్టీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈరోజు ఆమెను కలిశారు. లోటస్ పాండ్‌లోఈరోజు మధ్యాహ్నం షర్మిలతో అయన భేటీ అయ్యారు. షర్మిలతో భేటీ తరువాత బ్రదర్ అనిల్ కుమార్‌తో కూడా రామకృష్ణారెడ్డి చాలాసేపు మంతనాలు జరిపారు. వైఎస్ జగన్ దూతగా షర్మిలతో మాట్లాడేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారని తెలుస్తోంది .
మరోపక్క వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె ఈరోజు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఆమె ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. పోడు భూముల అంశం ముఖ్య అజెండాగా ఖమ్మంలో ఈ సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులతో పాటు గిరిజనులతో షర్మిల సమావేశం కానున్నారు.