టీడీపీ వర్గ పోరు.. ఇద్దరు దారుణ హత్య..

 

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు భగ్గుమన్నాయి. ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బలరాం వర్గీయులపై, గొట్టిపాటి వర్గీయులు దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందారు.  వివరాల ప్రకారం.... బల్లికురవ మండలం వేమవరంలో ఓ వివాహానికి వెళ్లి బైకులపై వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు రాత్రి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కంట్లో కారం కొట్టి కర్రలతో తీవ్రంగా దాడిచేసి వెళ్లిపోయారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా మిగిలిన వారు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చిలకలూరిపేటలో ఆస్పత్రికి తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu