మేడ్చల్ ఇండస్ట్రీలో పేలిన బాయిలర్.. ఒకరికి తీవ్ర గాయాలు
posted on Jul 1, 2025 3:42PM

మేడ్చల్ పారిశ్రామికవాడలోని ఆల్కలాయిడ్ బయో యాక్టివ్ ఫార్మా ఇండస్ట్రీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న కార్మికుడు శ్రీనివాస్ రెడ్డికి తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన యాజమాన్యం, తోటి సిబ్బంది బాధితుడిని వెంటనే పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వరుస ప్రమాదలతో కార్మికులు కలవరపడుతున్నారు. పరిశ్రమల్లో పనిచేసే వ్యక్తుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. పారిశ్రామిక ప్రమాదాలు తీవ్రంగా తీవ్ర విషాదాలు నింపుతున్నాయి. దీనికితోడూ భారీ ప్రాణనష్టం తీరని విషాదాలతో భయాందోళనలు కలిగిస్తున్నాయి. మరి ఏ తరహా పరిశ్రమల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రమాదాల నివారణకు అనుసరించాల్సిన విధివిధానాలపై ప్రభుత్వం కార్మికులకు అవగాహన కల్పించాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు