నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు... హేమమాలిని
posted on Jun 4, 2016 4:14PM
.jpg)
ఒక పక్క మథురలో హింసాత్మక ఘటనలు జరగుతుంటే మరో పక్క ట్విట్టర్లో తన ఫొటోలు పోస్ట్ చేసి విమర్శలు పాలయ్యారు బాలీవుడ్ డ్రీమ్ గాళ్, ఎంపీ హేమమాలిని. అయితే ఆ తరువాత ఫొటోలు తీసేశారనుకోండి. అయితే ఈ విషయంపై స్పందించిన హేమమాలిని.. మథుర అల్లర్లు జరగడంలో నాకు సంబంధం ఏంటో నాకు అర్ధం కావట్లేదు.. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు.. మథురలో లా అండ్ ఆర్డర్‌ని డీల్ చేయాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిది అని ఆరోపించారు. గత పదిరోజులుగా నేను మథురలోనే ఉన్నాను.. నేను ఇక్కడి నుండి వెళ్లిన తరువాత ఘటన జరిగింది.. ఆసమయంలో నేను షూటింగ్లో ఉన్నాను.. ఆ ఫొటోలు పోస్ట్ చేశాను.. వార్త తెలియగానే వెంటనే ఇక్కడి వచ్చేశాను అందులో తప్పేంటి అని ప్రశ్నించారు. అనంతరం మథుర కాల్పుల్లో మృతిచెందిన ఎస్పీ ముకుల్ ద్వివేది ఇంటికెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.. ఆతరువాత ఈ హింసాత్మక ఘటనలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ఆమె పరామర్శించారు. మొత్తానికి హేమమాలిని తనపై వస్తున్న ఆరోపణలు తిప్పికొట్టడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు.