మార్స్... ధూళి తుఫాను

 

ఈ నెల 24న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన భారత మార్స్ అర్బిటన్ మిషన్ (మామ్) అంగారక గ్రహ తాజా చిత్రాలను పంపించింది. ఉపగ్రహంలోని శక్తివంతమైన కెమెరా అంగారకుడి నార్తెన్ హెమీస్ఫియర్ (ఉత్తరార్థ గోళం)లో ధూళి తుఫాను ఫొటోలు తీసింది. ఈ ఫోటోలను మార్స్ సర్ఫేస్ కి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫోటోలను తీసింది. తాజాగా మామ్ పంపించిన ధూళి తుఫాన్ ఫోటోలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. గత గురువారం నాడు అంగారకుడి గ్రహానికి సంబంధించి తొలి విడత ఫోటోలను మామ్ పంపించింది.