గోవిందుడు అందరివాడేలే: షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ
posted on Oct 1, 2014 6:57AM

తారాగణం: రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కాశీ విశ్వనాథ్, సమీర్, కాదంబరి కిరణ్ తదితరులు.
సాంకేతికవర్గం: కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్ శంకర్ రాజా, రచన: పరుచూరి బ్రదర్స్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ.
అటు రామ్‌చరణ్ అభిమానులు, ఇటు కృష్ణవంశీ అభిమానులు ఎంతో ఎదురుచూస్తు్న్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విడుదలైంది. ఇది ఒక కుటుంబ కథా చిత్రం. లండన్‌లో పుట్టి పెరిగిన ఒక యువకుడు తన వంశ మూలాలను వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక తెలుగు గ్రామానికి వచ్చి, విడిపోయిన తన కుటుంబాన్ని ఎలా కలిపాడన్నది కథాంశం. కృష్ణవంశీ మార్కు ఫ్యామిలీ అంశాలతోపాటు, రామ్‌చరణ్ మార్క్ యాక్షన్ కూడా పుష్కలంగా వున్న సినిమా. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కలర్ ఫుల్‌గా వుంది. సరికొత్త రామ్‌చరణ్ కనిపించాడు. సినిమాలో అక్కడక్కడా పాత సినిమాల ఛాయలు వున్నప్పటికీ వాటిని కొత్తగా చూపించాడు. రామ్‌చరణ్, కాజల్‌జంట బాగుంది. వీళ్ళిద్దరి మధ్య విరసాలు, సరసాలు వర్కవుట్ అయ్యాయి. రామ్‌చరణ్ - ప్రకాష్ రాజ్, రామ్‌చరణ్ - జయసుధ, రామ్‌చరణ్ - శ్రీకాంత్ మధ్య సన్నివేశాలు బాగున్నాయి. ప్రకాష్ రాజ్ - జయసుధ మరోసారి తమ నట విశ్వరూపం చూపించారు. మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాని చెప్పే కథతో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గోవిందుడు అందరివాడేలే. పేరుకు తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా వున్న ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా.