ఫేస్ బుక్ దిగ్గజానికి కూడా హ్యాకింగ్ కష్టాలు...

 

'ఫేస్ బుక్' ద్వారా ప్రపంచాన్నే ఒక తాటిపైకి తెచ్చిన 'ఫేస్ బుక్' దిగ్గజం జుకెర్ బర్గ్ కు కూడా హ్యాకింగ్ కష్టాలు తప్పలేదు. ఈయన వాడే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ఖాతాలు హ్యాకింగ్ కు గురయ్యాయి. సౌదీకి చెందిన ‘అవర్‌మైన్‌’ బృందం జుకర్‌బర్గ్‌ ఖాతా పాస్‌వర్డ్‌ను గుర్తించినట్లు పేర్కొంది. అంతేకాదు ‘పింటరెస్ట్‌’, ‘ట్విటర్‌’ ఖాతాల హ్యాకింగ్‌కు తామే బాధ్యులమని అవర్‌మైన్‌ పేర్కొంది. జుకర్‌బర్గ్‌ సొంత ఖాతా ద్వారానే అవర్‌మైన్‌ ఓ సందేశాన్ని పోస్ట్‌ చేస్తూ.. ఖాతా భద్రతను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. దీంతో అవర్‌మైన్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాను మూసివేశారు.