జీన్స్ ప్యాంట్లు నిషేదం.. లుంగీలతో అమ్మాయిల నిరసన


కాలేజీల్లో అమ్మాయిలు వేసుకునే దుస్తువుల విషయంలో సాధారణంగా ఆంక్షలు విధిస్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అలా ఆంక్షలు విధించినందుకు ఏకంగా లుంగీలు కట్టుకొని తన నిరసన తెలియజేశారు ఓ కళాశాల అమ్మాయిలు. ఈ విచిత్రమైన ఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా.. కేరళలో వివరాల ప్రకారం.. దేశంలోనే విద్యాధికుల రాష్ట్రంగా పేరుపొందిన కేరళలోనూ  ఓ కళాశాలలో జీన్స్ ప్యాంట్లను నిషేధిస్తూ అమ్మాయిల దుస్తులపై ఆంక్షలు విధించారు. దీంతో కొంతమంది అమ్మాయిలు లుంగీలు కట్టి, మగాళ్లకు మల్లే మోకాళ్లపైకి లుంగీని మడిచి కట్టి నిరసన తెలిపారు. కాగా ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

అయితే దీనిపై మరో వాదన కూడా వినిపిస్తుంది.. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని అనుకరించిన కాలేజీ అమ్మాయిలు లుంగీలు కట్టి సరదాగా ఈ ఫొటో తీసుకున్నారని అంటున్నారు. ఇంకో వాదన కూడా వినిపిస్తుంది.. గతేడాది మలయాళీ పండుగ ‘ఓనం’ను పురస్కరించుకుని ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కాలేజీకి చెందిన అమ్మాయిలు లుంగీలు కట్టి డ్యాస్న్ చేసేముందు ఫొటో తీసుకున్నారట. మొత్తానికి ఎలా తీసుకున్న అమ్మాయిలు మాత్రం లుంగీ కట్టులో చూడటానికి చూడ ముచ్చటగా ఉన్నారని పలువురు మాత్రం ప్రశంసిస్తున్నారు.