మనోరమాదేవికి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ ను విచారణకు తీసుకోని కోర్టు..

 

మనోరమా దేవికి కోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ ను కోర్టు విచారణకు స్వీకరించలేదు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ముందు కేసు డైరీని, పూర్తి వివరాలను, ఎఫ్ఐఆర్ కాపీని అందించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా పూర్వాపరాలు తెలుసుకోకుండా, యాంటిసిపేటరీ బెయిల్ పై విచారించలేమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాగా బీహార్లో సంపూర్ణ మద్య పానం నిషేదించిన తరువాత  మహోరమా దేవి ఇంట్లో విదేశీ బ్రాండ్లకు చెందిన బ్రాందీ, విస్కీ బాటిళ్లు ఉండటంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోయింది. మరోవైపు మనోరమాదేవి కొడుకు రాఖీ యాదవ్ ఇప్పటికే నేరం అంగీకరించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu