మాల్యా కొత్త ఆఫర్.. ఆ హామీ ఇస్తే భారత్ కు వస్తా..
posted on May 16, 2016 10:32AM
.jpg)
గతంలో బ్యాంకులకు ఆఫర్లు ఇచ్చిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఇప్పుడు తాజాగా మరో ఆఫర్ తో ముందుకొచ్చారు. ముంబైలో జరిగిన యునైటెడ్ బ్రూవరీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో విజయ్ మాల్యా కూడా పాల్గొన్నారు. వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్న ఆయన ఓ ప్రకటన చేశారు. తాను బ్యాంకులకు బకాయి పడ్డ రుణాలు చెల్లించడానికి సిద్దంగానే ఉన్నానని.. అయితే తనను అరెస్ట్ చేయమని.. అంతేకాదు తగిన భద్రత కల్పిస్తామని హామి ఇస్తేనే భారత్ వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా మాల్యా మొత్తం 17 బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని 9 వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాల్యాను భారత్ కు రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మాల్యా కొత్త ప్రతిపాదనను అంగీకరిస్తారా?.. తను అడిగిన హామీ ఇస్తారా..? చూద్దాం ఏం జరుగుతుందో..