ప్రారంభమైన ఐక్యతా ర్యాలీ.. చుట్టూ జనాలే!!

 

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాల ఐక్యతను చాటిచెప్పేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పిలుపునిచ్చిన భారీ ఐక్యతా ర్యాలీ ప్రారంభమైంది. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ మైదానం వేదికగా జరుగుతున్న ఈ బహిరంగసభకు బీజేపీయేతర పార్టీలకు చెందిన పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. చంద్రబాబు, అఖిలేష్‌యాదవ్, స్టాలిన్, శరద్‌పవార్, దేవెగౌడ, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, యశ్వంత్‌సిన్హా, తేజస్వీయాదవ్, హార్దిక్‌పటేల్, జిఘ్నేశ్, శరత్‌యాదవ్, శతృఘ్నసిన్హా, కుమారస్వామి, అరుణ్‌శౌరి, మల్లికార్జునఖర్గే, హేమంత్ సొరేన్, అభిషేక్ సింఘ్ని తదితరులు హాజరయ్యారు. వీరిని మమతా బెనర్జీ సాదరంగా స్వాగతించారు. తృణమూల్‌ కార్యకర్తలతో సభా ప్రాంగణం నిండిపోయింది. అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu