ఫోబియాలపై యుద్ధమిలా చేయండి!!

 

చీకటంటే కొందసరికి భయం, వెలుగంటే మరికొందరికి భయం, పురుగులను చూస్తే కొందరికి భయం, తినే పదార్థాలు కొన్ని చూస్తే భయం, ఎత్తైన ప్రదేశాలు అంటే భయం, రక్తం చూసినా ఆ రంగు అన్నా భయం, ఎక్కువ నీళ్లు చూస్తే భయం ఇలా మనిషి బుర్రలో ఎన్నో భయాలు. వైద్యరంగంలో డాక్టర్లు ఈ భయాలకు ఒక్కో దానికి ఒక్కో పేరు పెట్టి, వాటికి ఫలానా ఫలానా మందులు కనుగొన్నామని వైద్యం చేస్తామని చెబుతూ ఉంటారు ప్రజలు కూడా డాక్టర్ల దగ్గరకు పరిగెత్తుకుంటూ పోతుంటారు. 

ఇలా మనిషిలో ఉన్న అతి భయానికి ఫోబియా అనే పేరు పెట్టి దానికి వైద్యం గట్రా కనిపెట్టి మనుషుల మానసిక బలహీనతలను డబ్బు చేసుకుంటున్నారు వైద్యరంగంలో జబ్బుల ఆవిష్కర్తలు.

ఫోబియాలు ఎందుకు??

అవునూ నిజానికి ఫోబియాలు ఎందుకు కలుగుతున్నాయి మనిషికి అని ఆలోచిస్తే అదొక మానసిక బలహీనత అని ఆ బలహీనత చాలా పెరిగిపోతే దానికి ఫోబియా అనే పేరు పెడుతున్నారని అర్థమవుతోంది. కాలక్రమేణా మనిషి మెదడుపై వేస్తున్న భారమే మనిషిలో ఆలోచనలు పెరగడం లేదా అతిగా రూపాంతరం చెందడం జరుగుతూ వస్తోంది. అది మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుకోని సంఘటనలు ఒత్తిడిలోకి నెట్టి అవి క్రమేణా భయాలకు దారి తీసే, ఆ భయాలు కాస్తా ఫోబియాలుగా ఎదిగి మనిషిని ప్రశాంతతకు దూరం చేస్తాయి. ఇలా ఫోబియాలు మనిషి జీవితాల్లో భాగం అవుతూ వస్తున్నాయి.

తప్పు ఎక్కడుంది??

నిజానికి ప్రతి భయం మనిషి మానసిక స్థితిని దెబ్బతీసేదే అయితే ఆ మానసిక స్థితి దెబ్బ తింటూ ఉన్నపుడు మానసిక స్థితిని మెరుగుపరుచుకోకపోగా…. దానికోసం లేనిపోని మందులు వాడుతూ శరీరాన్ని మత్తులోకి నెడుతూ శరీర ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు.  

ఒకరి భయం మరొకరి వ్యాపారం!!

ప్రపంచం అన్ని కోణాల లోనూ వ్యాపారం చేస్తుంది. ముఖ్యంగా ఒకరి బలహీనతే మరొకరికి వ్యాపారం. ఈ సూత్రాన్ని పాటించని రంగం కూడా లేదు. వైద్యరంగంలో ఇది మరీ ఎక్కువగా కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా చిన్న విషయాలను భూతద్దమంత చూపెట్టి ప్రజలను ఆ భయంలోకి నెట్టి, ఉన్న మానసిక సమస్యని ఎన్నో రెట్లు పెంచేది వైద్యరంగాలే. ఈ విధంగా చూస్తే మనుషుల్లో ఫోబియాలు, రోగాలు సృష్టిస్తున్నది తరువాత మనుషుల నుండి ఆర్జిస్తున్నది పూర్తిగా వైద్యరంగంలో రహస్య చర్యలే.

ఫోబియకు మందు!! జీవితానికి పరిష్కారం!!

ఫోబియాలు ఎన్నైనా ఉండనివ్వండి అవన్నీ మనిషిని మానసికంగా దెబ్బతీసేవే, ప్రశాంతతను దూరం చేసేవే. ఇలాటి ఫోబియాలకు డాక్టర్లు రాసిచ్చే మందులు వాడితే తగ్గిపోతుందా?? 


డాక్టర్లు నెలల వారిగా కోర్సుల పేరిట మందులు రాసిచ్చి వాటిని వాడమని చెబుతారు. ఆ ఫోబియా బాధితులు కూడా మందులు వాడుతూ ఆ మందులలో ఉన్న ప్రభావం వల్ల కాస్త మత్తులోకి జోగుతూ రాత్రిళ్ళు చక్కగా నిద్రపోతూ ఉద్యోగాల పనులలో పడిపోయి ఆ అతి ఆలోచనలకు దూరంగా ఉంటూ మందుల వల్ల తమకు బాగవుతోంది అనే భ్రమలో ఉంటారు. 


ఒకవేళ అదే నిజమైతే ఆ మందుల వాడకం పూర్తయ్యాక సమస్య పరిష్కారం అవ్వాలి కదా కానీ మళ్ళీ సమస్య మొదటికి వచ్చినట్టు మందులు అపగానే మళ్ళీ ఆలోచనలు, భయం మొదలయ్యి నిద్ర దూరమయ్యి మళ్ళీ ముందులాగా మారిపోతుంటారు.  ఇలాంటి వాళ్ళు కేవలం తాత్కాలిక పరిష్కారం కోసం మందులు వాడేస్తారు కానీ శాశ్వత పరిష్కారం కోసం ఎప్పుడూ కృషి చెయ్యరు.

శాశ్వత పరిష్కారముందా??

అవును ప్రతి సమస్యకూ ఓ శాశ్వత పరిష్కారం అంటూ ఉండనే ఉంటుంది. అయితే అదంతా మనిషి మానసిక స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. మనిషి ఎప్పుడైతే మానసిక స్థాయిని మెరుగుపరుచుకుంటాడో అప్పుడు శారీరక సమస్యలు, లోపాలు కూడా ఎక్కువ భాదించవు.

ఎంతోమంది శారీరక లోపాలు కలిగిన వాళ్ళు జీవితాలలో ఎన్నో విజయాలకు చేరువ అవుతున్నారు. వాటన్నిటికీ  కారణం ఏమి అని తరచి చూస్తే వాళ్ళ మానసిక స్థాయి సాధారణ మనుషుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. తమలో లోపాన్ని మరచి మరీ విజయంవైపు అడుగులు వేస్తూ ఉంటారు. అలాంటిది మానసిక సమస్య ఉన్న శారీరక ఆరోగ్యవంతులు మానసిక సమస్యను అధిగమించడం అసాధ్యమేమి కాదు.


మన భారతీయ ఆయుర్వేదం మరియు మన సనాతన ధర్మం మన మహర్షులు ప్రసాదించిన ధ్యానం, ప్రాణాయామం, యోగ వంటివి జీవితంలో భాగం చేసుకుని పాటిస్తే కేవలం నెల రోజులలో ఎంతో గొప్ప పరిష్కారం లభిస్తుంది.

◆వెంకటేష్ పువ్వాడ◆