ఎన్టీఆర్ వ్యక్తి కాదు వ్యవస్థ...

 

టీడీపీ మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...తెలుగుదేశం పార్టీ 36 వ సంవతర్సంలోకి అడుగుపెట్టిందని.. పార్టీ యుక్త వయసులో ఉందని అన్నారు. తెదేపా మహానాడు తెలుగువారందరికీ పండుగ..తెలుగుదేశం బడుగు, బలహీన వర్గాలు తెలుగువారీ ఆత్మగౌరవం కాపాడటానికే పార్టీ స్థాపించడం జరిగిందని.. తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని.. చెప్పారు. ఇంకా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు...ఎన్టీఆర్ ఓ వ్యక్తి కాదు ఓ వ్యవస్థ... పటేల్, పఠ్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేశారు...ఎన్టీఆర్ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడమే సరైన నివాళి అని.. భారతరత్న ఇవ్వడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు. ఇంకా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ...మీరు చూపిన ఆదరణ, ఉత్సాహం జీవతంలో మరువలేను...కార్యకర్తల వల్లే టీడీపీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది..ఎంతోమంది కార్యకర్తల త్యాగం వల్లే టీడీపీ బలంగా ఉందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu