బీఆర్ఎస్ లో లక్కీ భాస్కర్ స్కీమ్?

నాన్నా విదేశాలకు వెళ్లిపోదాం పదండి.. ఇదీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో చేస్తున్న కొత్త ప్రతిపాదనగా పార్టీ వర్గాలు, పరిశీలకులు అంటున్నారు.   బీజేపీ నేత సీఎం రమేష్  రహస్యాలన్నీ బయట పెట్టేశారు..  అవి మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు ఫోన్ ట్యాపింగ్, సహా పలు కేసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో  స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత   అరెస్టు తప్పదన్న ప్రచారమూ జోరుగా ఉంది. అంతే కాకుండా  అన్ని కేసుల దర్యాప్తులూ చివరి దశకుచేరుకుంటున్నాయి.   రీసెంట్ గా కాళేశ్వరం కర్త- కర్మ- క్రియ అన్నీ కేసీఆరే అంటూ కాళేశ్వరం కమిషన్ నివేదికను ఉటంకిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రముఖంగా ప్రచురించింది. ఇలా అన్ని ఇబ్బందులూ, కష్టాలూ ఏకకాలంలో చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇక్కడే ఉంటే అవమాన భారం తప్పదన్న భావనతో కేటీఆర్  విదేశాలకు పోదాం అన్న ప్రతిపాదన చేసినట్లు పరిశీలకులు అంటున్నారు. 

ఇప్పటికే కేటీఆర్.. తన తండ్రి కేసీఆర్ ముందు యూఎస్, యూకే, దుబాయ్ వంటి ఆప్షన్లు ప్రతిపాదించారట ఇంత చేశారు. సంపాదించారు. వాటిని లక్కీభాస్కర్ సినిమాలో ఆ హీరో లాఎస్కేపై సేఫ్ గా ఉందామన్నదే కేసీఆర్ ప్రతిపాదనగా చెబుతున్నారు.  అయినా ఇదేమైనా జరగనిదా? గతంలో బ్రిటీషర్లు కూడా అంతేగా.. 3 లక్షల కోట్ల మేర పడవల్లో సర్దేసుకుని మన సంపదతో ఉడాయించారు. వాళ్లేమైనా మనలాగా రాష్ట్ర సాధన చేశారా? మన దేశమే మనికిచ్చి వెళ్లిపోయారు. అదే మనం  రాష్ట్రాన్ని సాధించాం. ఎప్పటికీ మీరే సీఎంగా ఉంటారని నమ్మాం. కానీ జనం కాంగ్రెస్ కి అధికారమిచ్చి మనకు జలక్ ఇచ్చారు. అలాంటి జనానికి మనమూ ఓ జర్క్ ఇద్దాం. దానికి తోడు ఇదేమైనా కొత్తా.. మొన్నటికి మొన్న మనకన్నా ముందే ప్రభాకర్ రావు యూఎస్ చెక్కేయలేదూ.. మనమూ అలాగే వెళ్లిపోదాం అన్నది కేటీఆర్ వాదనట. 

అంతా బాగుంది కానీ ఇంత బతుకు బతికి అక్కడెక్కడో దేశం గాని దేశానికెళ్లి సెటిలవడమేంటన్నది కేసీఆర్ అభ్యంతరమట. ఇక్కడే ఉందాం... నేనుండే వరకూ నన్ను వేధిస్తారు. ఆ తర్వాత అంతా మరచి పోతారు. నువ్వు నీ కుటుంబం, నీ చెల్లి బావ, ఇతర బంధుమిత్రులు హ్యాపీగా బతకొచ్చు. కాబట్టి ఏం నారాజ్ కావద్దని కేసీఆర్ కేటీఆర్ ను సముదాయిస్లున్నారట.  మరి ఈ అటలో ఎంత వరకూ వాస్తవం ఉందో..  కేసీఆర్ జైలుకెళ్తారా? ఆ అవమాన భారాన్ని మోస్తారా? చూడాల్సి ఉందంటున్నారు పరిశీలకులు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu