మూఢభక్తి.. దేవుని దగ్గరకంటూ బలవన్మరణం!
posted on Aug 4, 2025 9:25AM

దేవుడిపై భక్తి ఉండటంలో తప్పులేదు. కానీ అధి మూఢభక్తిగా మారితే మాత్రం అనర్ధాలు తప్పవు. సరిగ్గా అలాగే జరిగింది ఆ వివాహిత విషయంలో. హాయత్ నగర్ ఉర్దూ గల్లిలో నివాసం ఉండే అరుణ్ కుమార్ భార్య పూజకు దైవ భక్తి ఎక్కువ. ఆమెకు భర్త అరుణ్ కుమార్, పిల్లలు ఏ రకంగా చూసినా ఆమెది చింతలు లేని చక్కటి కుటుంబం. అయితే పూజకు దైవభక్తి మెండు. నిత్యం పూజలూ, పునస్కారాలతోనే గడుపుతుంటుంది.
ఆమె భక్తి మూఢ భక్తి లిమిట్ కూడా దాటిపోయింది. ఏకంగా దేవుడి దగ్గరకు వెడుతున్నానంటూ ఓ ఐదు పేజీల సూసైడ్ నోట్ రాసి తాము నివసిస్తున్న అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూడాల్సిన ఆమె దేవుడి దగ్గరకు ప్రయాణం అంటూ తనువు చాలించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.