ట్రైన్ కింద పడిన ప్రేమజంట
posted on Mar 25, 2015 11:45AM

ప్రేమ ప్రాణాలు పోస్తుందని అంటారు.. కానీ ప్రేమ ప్రాణాలు తీస్తోంది. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ కారణంగా ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ప్రేమ కారణంగా ప్రాణాలు తీసుకున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇదిలా వుంటే, బుధవారం నాడు ఖమ్మం జిల్లాలో ఒక ప్రేమ జంట రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. బాగా చదువుకున్నవారైనప్పటికీ క్షణికావేశంతో ప్రాణాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్, నీలిమ వరంగల్లోని ఎస్ఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. వీరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దల నుంచి అంగీకారం లభించలేదో, మరో కారణం ఏదైనా ఉందోగానీ, వీరిద్దరూ బుధవారం ఉదయం ఖమ్మం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా పెద్దపోతల పాడు గ్రామానికి చెందిన మాధవి (20), సుమన్ (20) కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.