ఇవాళ భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందా..? లేదా..?
posted on Jun 4, 2017 11:41AM
.jpg)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చాలా రోజుల తర్వాత రెండు జట్లు తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అన్న దానిపై సందేహాలు తలెత్తాయి. నిన్న రాత్రి కొందరు ఉగ్రవాదులు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో పాటు పాదచారులను వ్యాన్‌తో ఢీకొట్టారు. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే మ్యాచ్ జరిగే బర్మింగ్‌హామ్‌కు ఈ ప్రాంతం 208 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో భారత్-పాక్ మ్యాచ్‌పై అనుమానాలు రేకిత్తేంచింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఐసీసీ..అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారీ బందోబస్తు మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఓ ప్రకటన విడుదల చేసింది.