ఏపీ పునర్విభజన చట్టంలో లోపాలున్నాయి
posted on Mar 17, 2015 4:39PM

లోక్ సభలో రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో లోపాలు ఉన్నాయని అన్నారు. శాసనసభ్యుల సంఖ్యను బట్టి మండలి సభ్యుల సంఖ్యను కేటాయించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2004లో హామీ ఇచ్చి 2014 వరకు ఎందుకు ఆగారని, వందల మంది ఆత్మత్యాగాలు చేసుకొనేవరకు రాష్ట్ర విభజన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. బిల్లులో చెప్పిన విధంగా ఐఐఎంకు శంకుస్థాపన జరిగిందని, గుంటూరులో ఎయిమ్స్ స్థాపనకు స్థలపరిశీలన జరిగిందని తెలిపారు.