హైదరాబాద్‌లో కుండపోత వర్షం
posted on Aug 9, 2025 10:06PM
.webp)
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, సికింద్రాబాద్, తార్నాక, రామాంతపూర్, అంబర్‌ఫేట్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. శనివారం రాత్రి సైతం హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో.. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.