మహిళా శక్తి కారణంగానే భారత్‌కు గుర్తింపు : స్పీకర్ ఓంబిర్లా
posted on Sep 14, 2025 1:29PM

భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్ధాలకు ముందే ప్రారంభమైందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహిళ సాధికరత సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయమని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. సామాజిక బంధనాలు తెంచుకొని అనేక ఉద్యమాలు చేశారు. మహిళా శక్తి కారణంగానే ప్రపంచంలోనే ముఖ్య దేశంగా భారత్ అవతరించిందని చెప్పారు.
మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్యదేశంగా అవతరించింది. రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, సైన్యంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్నారు. మహిళా సాధికారత ఒక్కరోజులో సాధ్యం కాదు. అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటే సాధ్యమవుతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని సభాపతి వెల్లడించారు.