అసెంబ్లీకి రాకపోయిన జీతం తీసుకుంటున్నారు : అయ్యన్నపాత్రుడు
posted on Sep 14, 2025 1:00PM

తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభమైంది. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా నేతృత్వంలో వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథిగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు హాజరైన ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతు కొందరు ఎమ్మెల్యేలు శాసన సభకు రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అన్నారు.
ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ఉద్యోగాలకు రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. చిరుద్యోగులు సైతం ‘నో వర్క్ - నో పే’ విధానం అనుసరిస్తున్నారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులు.. వాటికి కూడా రాకపోతే ఎలా?’’ అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.