లోక్ సభ 12గంటల వరకు వాయిదా

 

 

 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండు నిమిషాలకే ఉభయ సభలు వాయిదాపడ్డాయి. లోక్ సభ ప్రార౦భమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు సమైక్య నినాదాలతో సభలో గందరగోళం సృష్టించడంతో సభను స్పీకర్ 12గంటల వరకు వాయిదా వేశారు. ఈరోజు పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఎలాంటి అవాంచనీయ సంఘటలను జరగకుండా చూడాలని కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీలను భద్రతా సిబ్బంది పార్లమెంట్ లోనికి అనుమతించడం లేదు. దీంతో సస్పెండ్ అయిన సీమాంధ్ర ఎంపీలు సభలో వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభంకాగానే సీమాంధ్ర ఎంపీలు వెల్‌లో నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలపడంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను గంటపాటు వాయిదా వేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu