లంకె బిందెల్లో 5 కిలోల బంగారం.. 

యేరు సెనగ కొరకు మట్టిని తొవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే.. సాంగ్ చాలా ఫేమస్. అందరు ఏ వంద సార్లో వినే ఉంటారు. నిజంగానే మట్టిని తవ్వితే లంకె బిందెలు దొరికాయి.. ఒకటి కాదు రెండు కాదు ఆ లంకె  బిందెలో 5 కిలోల బంగారం బయట పడింది. ఆ పేరు వింటే ఎవరికైన జోష్ వస్తుంది. లైఫ్ లో ఒక లంకె బిందె అయినా దొరికితే చాలు అనుకుంటారు చాలా మంది. లంకె బిందెలు అనే మాట పురాతన కాలం నుండి వింటున్నాం.  కానీ అవి ఎప్పుడో కనుమరిగిపోయాయి.  అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట బయట పడుతుంటాయి. తాజాగా తెలంగాణాలో లంకెబిందెలు బయటపడ్డాయి.  

అది జనగామ జిల్లా పెంబర్తి. చుట్టూ దేవాలయాలు. పురాతన కట్టడాలు. పెంబర్తి పేరు వింటే అస్త కళలకు పెట్టింది పేరు. నర్సింహా అనే రైతు తన భూమిని చదును చేస్తుండగా లంకె బిందెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా అందులో సుమారు 5 కిలోల బంగారం ఉండటంతో రైతు  అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని అధికారులకు సమాచారమందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు లంకెబిందెలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.