లాలూ తరువాత జగన్
posted on Oct 1, 2013 6:38PM
.jpg)
ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. లాలూ మాదిరిగా జగన్ దోషిగా రుజువు కావడం తథ్యమని అన్నారు. రూ.950 కోట్ల దాణ కుంభకోణం కేసులో లాలూ దోషిగా తేలినట్టే లక్ష కోట్ల రూపాయల కుంభకోణంలో జగన్ కూడా దోషిగా తేలుతాడని తెలిపారు.
తాను పదహారు నెలలు జైళ్లో ఉన్నానని ప్రచారం చేసుకుంటూ జగన్ ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని యనమల విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని, సహకరిస్తానని జగన్ సోనియాకు మాట ఇచ్చి అసెంబ్లీ ఏర్పాటు ద్వారా అందుకు సహకరించాలని చూస్తున్నారని యనమల ఆరోపించారు.
జగన్ నీతి వ్యాఖ్యలు వల్లించడం సెక్యులరీజం గురించి జగన్ మాట్లాడ్డాం విడ్డూరంగా ఉందని, సైతాన్ బైబిల్ చదివినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఒక కుంభకోణం కేసులో నిందితునికి గవర్నర్ ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారని యనమల ప్రశ్నించారు.