విజయమ్మ చిలుకపలుకులు
posted on Oct 1, 2013 3:41PM
.jpg)
పరకాల ఉప ఎన్నికల సమయంలో విజయలక్ష్మి చిలుకపలుకులు పలికారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పై మాట మార్చినవారాని ద్రోహులుగానే పరిగణిస్తామని అన్నారు. ఓయూ విద్యార్థులను తాలిబన్లతో పోల్చినప్పుడు అది మీకు సంస్కారమనిపించిందా అని అడిగారు. సీమాంధ్ర నేతలు రాక్షసులని అనలేదని, తానేమీ మాట్లాడినా తప్పు అనడం దత్తాత్రేయ, నారాయణకు అలవాటైపోయిందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం కోసం రెండు నెలలుగా సహనంతో ఉన్నామని, తమ సహనాన్ని అలుసుగా భావించవద్దని హెచ్చరించారు. అశోక్‌బాబు కోట్లాటకు రమ్మని ఉసుగొల్పడం సంస్కారమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చిన వైకాపా ఇక్కడ సభ ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ పెడితే ఏం జరుగుతుందో అదే జరుగుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర నాయకులు అవాకులు చవాకులు మానుకోవాలని, సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.