సీబీఐ ముందుకు కేవీపీ

 

 

KVP to be grilled by CBI in Jagan case today, KVP to be grilled by CBI

 

 

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 11 గంటలకు కేవీపీ సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో కేవీపీని సీబీఐ ప్రశ్నించనుంది. కేవీపీ వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు సమాచారం. వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూర్యుడు వాంగ్మూలా౦ ఆధారంగా సీబీఐ కేవీపీని విచారించనుంది. 2004 మే24న క్యాబినెట్ హోదాతో వైఎస్ కేవీపీని ప్రభుత్వ సలహాదారుడుగా నియమించారు. ఆ హోదాలో ఆయన వైఎస్ హయాంలో కీలక నిర్ణయాల్లో భాగ స్వామిగా ఉన్నారు.