డి.శ్రీనివాస్‌కు మళ్ళీ పిసిసి అధ్యక్ష పదవి..!

 

 

D Srinivas Rao botsa satya naryana, botsa satya narayana pcc, cm kiran botsa

 

 

డి.శ్రీనివాస్‌కు మరోసారి పిసిసి అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జైపూర్‌లో జరిగిన చింతన్‌ శిబిర్‌లో పిసిసి, డిసిసి అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు సాధారణ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించారు. ముఖ్యమంత్రి పదవి పట్ల ఆశలు పెట్టుకున్న బొత్స సత్యనారాయణ శాసన సభ్యునిగా లేకపోతే ముఖ్యమంత్రి పదవికి అవకాశాలు సన్నగిల్లుతాయేమోనని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు పిసిసి అధ్యక్ష పదవి నుండి తప్పుకొని తన నియోజకవర్గంపైనే దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

 


ఒకవేళ ఎన్నికల వరకు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పదవిలో కొనసాగినా, ఎన్నికల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో, పరిణామాలు ఎలా మారుతాయో ఊహించలేమని, అప్పుడు శాసన సభ్యునిగా లేకపోతే ముఖ్యమంత్రి పదవికి అవకాశాలు సన్నగిల్లుతాయేమోనని బొత్స భావిస్తున్నట్లు సమాచారం.

 


ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంఎల్‌సిగా కొనసాగుతున్న డి.శ్రీనివాస్‌కే మూడవసారి పిసిసి అధ్యక్ష పదవివరించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం, బి.సి. వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అధిష్ఠానంకు నమ్మకస్తునిగా ఉండటం ఆయనకు ప్లస్‌ పాయింట్లు. పైగా కాంగ్రెస్‌ అధికారంలో వచ్చిన గత రెండు సాధారణ ఎన్నికలు జరిగిన సమయాల్లో డి.శ్రీనివాస్‌ పిసిసి అధ్యక్షునిగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం.