పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్...
posted on May 24, 2017 11:25AM
.jpg)
పాకిస్థాన్ కు ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ కోర్టులో పాక్ కు షాక్ తగిలింది. జాధవ్‌కు పాక్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తుది తీర్పు వచ్చేంతవరకు శిక్ష అమలు చేయవద్దని పాకిస్తాన్‌కు ఐసీజే ఆదేశించింది. ఇప్పుడు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకూ గూఢాచార్యం నేరం కింద.. భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను పాక్ తమ దేశంలో అరెస్ట్ చేశామని చెబుతూ వచ్చింది. అయితే అది అబద్దమని తేలిపోయింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మాజీ అధికారి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అంజాద్ షోయబ్.. జాధవ్‌ను తమ దేశంలో అరెస్ట్ చేయలేదని.. జాధవ్‌ను ఇరాన్‌లో పట్టుకున్నామని వెల్లడించారు. దీంతో ఐఎస్‌ఐ మాజీ అధికారి ప్రకటనతో పాక్ దేశానికి దిమ్మతిరిగినట్టైంది. మరి దీనిపై పాక్ ఎలా స్పందిస్తుందో చూద్దాం..