ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... మోడీ దిగ్ర్భాంతి..
posted on May 24, 2017 11:10AM

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో దాదాపు 21 మంది మృత్యువాత పడ్డారు. వివరాల ప్రకారం..ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో చార్‌ధామ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి భగీరథి నదిలో పడిపోయింది. యాత్రలో భాగంగా వీరంతా గంగోత్రి ఆలయాన్ని సందర్శించుకుని హరిద్వార్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.
ఇదిలా ఉండగా జరిగిన ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం దురదృష్టకమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బాధితులకు పరిహారం ప్రకటించారు. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు పీఎంవో కార్యాలయం తెలిపింది.