టీఆర్ఎస్ లో స్వేచ్ఛ లేదంటున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే
posted on Oct 9, 2015 1:08PM

ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు... ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది, తీవ్ర తర్జనభర్జనల తర్వాత టీడీపీని వీడి... తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినా... తెలుగుదేశం పార్టీపై మాత్రం ఇంకా మమకారం పోలేదని చెబుతున్నారు, టీడీపీ తనకు సొంతిల్లు లాంటిదంటున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు... టీఆర్ఎస్ లో తాను సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందంటున్నారు. అయితే తనకు టీడీపీలో ఉన్నంత స్వేచ్ఛ... టీఆర్ఎస్ లో లేదని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు, మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలతో కంగుతిన్న ఆయన అనుచరులు, గులాబీ శ్రేణులు... బలవంతంగా టీఆర్ఎస్ లో చేరినట్లున్నారని మాట్లాడుకుంటున్నారు