కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

 

 

ఓటీటీలో వచ్చే ఓ సిరీస్ చూసి హత్య, చోరీకి ప్లాన్ చేసిన బాలుడు... హత్య కంటే రెండు రోజుల ముందే బాలుడు మిషన్ డన్ పేరుతో ఒక లేఖ రాసుకున్నాడు. దొంగతనం చేసి ఎస్కేప్ ఎలా అవ్వాలో కూడా ఓటీటీ ద్వారా ప్రభావితమయ్యాడు. గ్యాస్ లీక్ చేసి పరార్ అవ్వాలని ప్లాన్ చేశాడు. అదే విషయాన్ని మిషన్ డాన్ పేరుతో వచ్చిరాని ఇంగ్లీషు లో ఒక పేపర్ మీద రాసుకున్నాడు. పథకం ప్రకారం పక్కింట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అంతలో అమ్మాయి కనిపించింది. దీంతో భయపడిపోయిన బాలుడు తన దొంగతనం విషయం బయటపడకుండా ఉండడానికి బాలికను అతి దారుణంగా హత్య చేశాడు. 

బాలిక సహస్ర హత్య జరిగిన రోజే పోలీసులు బాలు డిని విచారించారు. అయితే విచారణ చేస్తున్న సమయం లోసహస్ర ఇంట్లో ఉన్న ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం వెళ్లానని పోలీసు లను తప్పుదోవ పట్టించాడు. సహస్ర ఇంట్లోంచి నాన్న నాన్న అని గట్టి గట్టిగా అరుపులు వినిపించాయని పోలీసులను నమ్మించాడు. బాలుడు చెప్పిన మాటలు నమ్మిన పోలీసులు సహస్రను ఇతరులు చంపి ఉంటారని అనుమానంతో విచారణ ప్రారంభించారు. ఇలా పోలీసులు గత ఐదు రోజులుగా భవనంలోని ప్రతి ఒక్కరిని విచారించడమే కాకుండా బాలిక తల్లిదండ్రులను కూడా విచారించారు. 


ఈ కేసులో ఎస్ఓటి, కూకట్పల్లి పోలీసులు 300 మందిని విచారించారు. అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా కూడా కూకట్పల్లి లో జరిగిన సహస్ర బాలిక హత్య కేసు మిస్టరీ వీడలేదు. ఈరోజు ఉదయం ఎస్వోటీ పోలీసులు మళ్లీ హత్య జరిగిన భవనానికి వెళ్లి ఆధారాలు సేకరి స్తున్న సమయంలో పక్క భవనం నుండి ఈజీగా ఈ బిల్డింగ్ లోకి దూకవచ్చునని  గుర్తించారు. దీంతో ఎస్ఓటి పోలీసులు పక్క బిల్డింగ్ లో ఉన్న వారందరిని విచారించారు. అయితే వర్క్ ఫర్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని కూడా ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు తన గది పక్కనే ఓ బాలుడు 15 నిమిషాల పాటు దాక్కొని ఉన్నాడని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. 

పక్క భవనంలోనే ఆ బాలుడు ఉంటాడని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు తెలిపారు. దీంతో ఎస్ఓటి పోలీసులు బాలుడికి కోసం వెంటనే స్కూలుకు వెళ్లి స్కూల్లోనే బాలుడిని పక్కకు పిలిచి విచారణ చేశారు. తనకు హత్యకు ఎటువంటి సంబంధం లేదని మరోసారి బాలుడు పోలీసులను తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులకు బాలుడి పై అనుమానం వచ్చి అతన్ని తీసుకొని ఇంటికి వెళ్లి ఇంట్లో తనిఖీ చేయగా.. కత్తి, రక్తంతో కూడిన దుస్తులు, పక్క ఇంట్లో దోచుకునేందుకు ప్లాన్ వేసిన మిషన్ డౌన్ పేరుతో  రాసుకున్న లేఖ లభ్యమైంది.

 దీంతో ఎస్ఓటి పోలీసులు వెంటనే బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితమే బాలుడి కుటుంబ సభ్యులు ఈ ఫ్లాట్లోకి వచ్చారు. ఇదే ప్రాంతంలో కిరాణా షాప్ నడుపుతు న్నారు. హత్య చేసిన బాలుడు మరియు  మృతు రాలి తమ్ముడు స్నేహితులు.... ఈ క్రమంలోనే మృతు రాలు సహస్ర పుట్టినరోజు వేడుకలకు నిందితుడు హాజరయ్యాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu