గులాబీ బాస్‌కి గుచ్చుకుంటోన్న ముల్లు

 

ఘోష్ నివేదిక నేరుగా మాకు ఇవ్వకుండా మీడియాకు ఇవ్వడంలో ఉద్దేశమేంటి? కేసీఆర్, హరీష్ ప్రశ్న. బాగుంది కానీ, ఓటుకు- నోటు కేసులో కేసీఆర్ చేసిందేంటి? అది పనిగా మీడియాకు వీడియోల లీకేజ్ చేసి తద్వారా వారి ప్రతిష్టకు భంగం కలిగించలేదా? ఇక ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నడిపించిన హైడ్రామాలో మీరు పాటించిన నిబద్ధత ఏపాటిది? అన్నదిక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది.

తమదాకా వచ్చే వరకూ గులాబీ దళాధిపతికి తెలియరాలేదా? అన్న కోణంలో కొందరు ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంలో ఎలాంటి డిజైనింగ్ లోటు లేదని చెబుతున్నారు సరే. మరి ఈఈలు, ఈఎన్సీలు ఇంత భారీ ఎత్తున ఎలా బొక్కారు? హరిరామ్, శ్రీధర్, మురళీధర్ రావు వంటి వారే వెయ్యి కోట్లకు పైగా వెనకేసిన పరిస్థితి. మరి దీని మాటేంటి? పదే పదే ప్రాజెక్టు వ్యయం పెంచింది నిజం కాదా? ఇదే విషయంపై కోర్టులో దావా వేసిన రాజలింగం అనే సామాజిక కార్యకర్త హతమారిపోవడంలో అంతరార్ధమేంటి? 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలకు సమాధానం రాబట్టాల్సిన పరిస్థితి. దీన్నిబట్టి సీనేంటో అర్ధం చేసుకోవచ్చు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడిగినట్టు.. కమిషన్ ముందు విచారణకు హాజరైనపుడు తెలియలేదా? ఈ ఘోష్ కమిషన్ రద్దు చేయాలని.. ఇప్పుడే ఎందుకు ఈ పిటిషన్లు వేసినట్టు? అన్న ప్రశ్నలకు కూడా కేసీఆర్ అండ్ కో సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ ఇరవై రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, ఆపై కేబినేట్ భేటీ తర్వాత ఈ వ్యవహారంపైనా ఒక సిట్ వేయడమా? లేక ఏదైనా దర్యాప్తు సంస్థకు అప్పగించడమా? తేలాల్సి ఉందంటున్నారు. మరి చూడాలి ఈ కేసు కేసీఆర్ తదితరులను ఏ స్థాయిలో ఇరుకున పెట్టనుందో తెలాల్సి ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu