మహేష్ భామ వార్తలు చదువుతుంది!

 

మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "1-నేనొక్కడినే". సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో కృతి న్యూస్ రీడర్ పాత్రలో కనిపించబోతుంది. 14రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను విడుదల చేసి, సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu