ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. చిక్కుల్లో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్

టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఏపీ నిఘా దళపతి పీఎస్సార్‌ ఆంజనేయులును చిక్కుల్లో పడేసిందా? నెల్లూరు వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఫోన్‌ ట్యాపింగ్‌ కు సంబంధించిన ఆధారాలను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్  పీఎస్సార్ ఆంజనేయులే తనకు అందించారంటూ మీడియా ఎదుట చెప్పంతో ఆయన చిక్కుల్లోపడేసిందనే పరిశీలకుల చెబుతున్నారు. 

కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. తన ఫోట్ ట్యాప్ అయ్యిందనీ, ఇందుకు సంబంధించిన ఆధారాలు బయటపెడతానన్న కోటం రెడ్డి అన్నంత పనీ చేశారు. మీడియా సమావేశంలో తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను వెల్లడించారు. దీంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో మంత్రి అమర్నాథ్ కోటం రెడ్డి చూపిన ఆధారాలు ట్యాపింగ్ కాదని, రికార్డింగ్ అని వ్యాఖ్యానించారు.

దీంతో కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వాస్తవమేనని మంత్రి అంగీకరించినట్లైంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలోఆందోళన పెరిగింది. ఇప్పటికే చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలలో తమ ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయి. ఆ విషయాన్ని కోటం రెడ్డి తన ప్రెస్ మీట్ లో చెప్పారు. తాను తన ఫోన్ ట్యాపింగ్ గురించి ఆరోపణలు చేయగానే పలువురు ఎమ్మెల్యేలు తమ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని తనకు చెప్పారని ఆయన అన్నారు.

ఇప్పుడు స్వయంగా మంత్రి రికార్డింగ్ వ్యవహారంతో అధికార పార్టీ తన సొంత ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టిందన్న విషయం తేటతెల్లమైపోయింది. ఒక ఎమ్మెల్యేకు స్వయంగా నిఘా విభాగం అధిపతే ఆయన ఫోన్ కాల్ రికార్డు పంపించారంటే.. అధికార పార్టీలోని ఎమ్మెల్యేల ఫోన్లన్నీ నిఘా నీడలోనే ఉన్నాయని భావించాల్సి ఉంటుంది. అదంతా పక్కన పెడితే.. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలంటూ బయటపెట్టిన వివరాలు ఏపీ ఇంటెలిజెన్స చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును చిక్కుల్లో పడేసిందన్నఅభిప్రాయం వ్యక్తమౌతోంది.