ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలి: బాపూజీ

న్యూ ఢిల్లీ: తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉందని  ఇందుకోసం రాజకీయేతర వేదిక కావాలని  స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వెల్లడించారు. దీని నిర్మాణం కోసం తాము కృషి చేస్తామని ఆ ప్రాంతానికి చెందిన  దీనిపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం చేసే ఉద్యమాలు, పోరాటాల స్వరూపం మారుతున్నప్పటికీ లక్ష్యం మాత్రం మారకూడదన్నారు. అందుకే తాము ఏర్పాటు చేయనున్న రాజకీయేతర వేదికలో రాజకీయ పార్టీల శ్రేణులకు స్థానం లేదన్నారు. తెలంగాణపై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేనందున పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసిన తర్వాతే తమ ఉద్యమంలో భాగస్వాములు కావాలని అందరినీ కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu