టీడీపీలోకి కొణతాల? ఈసారైనా జరిగేనా?
posted on Nov 21, 2015 2:27PM
.jpg)
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీని వీడిన తరువాత కొణతాల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయిన అనంతరం ఇప్పుడు టీడీపీలో చేరుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే గత శాసనమండలి ఎన్నికల సమయంలోనే కొణతాల తెదేపాలోకి చేరాల్సి ఉంది. కాని అప్పుడు పెందుర్తి ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్య నారయణ కారణంగా అది జరగలేదు. ఎందుకంటే అప్పుడు కొణతాల టీడీపీలోకి చేరడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నాడు.. అయితే కొణతాలతో పాటు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని కూడా టీడీపీలోకి తీసుకురావాలని ప్రయత్నించాడు. కానీ దానికి బండారు సత్యనారాయణ అభ్యంతరం చెప్పడంతో కొణతాల చేరిక ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ కొణతాల చంద్రబాబును కలిసే సరికి మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం కొణతాల టీడీపీలో చేరికకు వెనుక ఉంది మంత్రి అయ్యన్న పాత్రుడని అర్ధమవుతోంది. ఈయనే కొణతాలను పార్టీలోకి తీసుకురావాలని.. కొణతాల కనుక వస్తే విశాఖలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా కొణతాల చేరిక సాధ్యమవుతుందో లేదో చూడాలి.